రమ్యకృష్ణ సీమంతం ఫొటోలు వైరల్!

కరోనా నేపథ్యంలో షూటింగులు లేకపోవడంతో ఇంట్లోనే ఉంటూ సినీనటులు తమపాతకాలపు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా సినీనటి రమ్యకృష్ణతనట్విట్టర్‌ ఖాతాలో రెండు ఫొటోలు పోస్ట్ చేసింది. అవి తనసీమంతవేడుకకి సంబంధించినఫొటోలని చెప్పింది. తనఇద్దరు అత్తమ్మలు తనను ఆశీర్వదించారని, వారు ఇప్పుడు జీవించిలేరని పేర్కొంది. మంచి జ్ఞాపకాలని ట్యాగ్‌ జోడించింది. అలాగే, మరో ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేస్తూ ఇందులో తనసీమంతవేడుకలో పాల్గొన్నతనతల్లి ఉందని చెప్పింది. తనవెనుకనిలబడి తనతల్లి ఫొటోలు తీసిందని తెలిపింది. రమ్యకృష్ణతల్లి ఇందులో కెమెరా…

మళ్లీ పాములు కృష్ణా జిల్లాలో… ప్రజల బెంబేలు!

వర్షాకాలం ప్రారంభం కాగానే, కృష్ణా జిల్లాలో పాములసంచారం పెరిగింది. అవనిగడ్డ, పామర్రు ప్రాంతాల్లో విషసర్పాలు అధికంగా కనిపిస్తున్నాయి. జూలైలోనే 95మంది పాము కాటుకు గురికాగా, నిన్నఒక్కరోజులోనే 9పాము కాటు కేసులు మొవ్వపీహెచ్సీ పరిధిలో నమోదయ్యాయి. మరో రెండు మూడు నెలలపాటు పాములసంచారం ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు. ఎవరినైనా పాము కరిస్తే, నాటు వైద్యులవద్దకు వెళ్లకుండా, సమీపంలోని ప్రభుత్వఆసుపత్రికి వెళ్లాలని, యాంటీ స్నేక్ వెనమ్ ఇంజక్షన్లు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. కాగా,…

నిమ్స్‌లో మరో వ్యక్తికి కరోనా ‘కోవాగ్జిన్’

కరోనా వైరస్‌ను నిరోధించడానికి వ్యాక్సిన్‌ను తీసుకురావడానికి భారత్‌ బయోటెక్‌, భారతవైద్యపరిశోధనమండలి (ఐసీఎంఆర్‌) కలిసి కోవాగ్జిన్‌ పేరిటవ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోన్నవిషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌లోని నిమ్స్ ‌ కేంద్రంగా పనిచేస్తున్నవ్యాక్సిన్‌ తయారీ బృందం మొదటి దశట్రయల్స్‌ ప్రారంభించింది. క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా మూడు రోజులక్రితం ఇద్దరు వాలంటీర్లకు తొలి డోస్‌లు ఇచ్చారు. వారిని ఐసీయూలో ఉంచి 24గంటలపాటు వైద్యబృందం పర్యవేక్షించినఅనంతరం ఎలాంటి అనారోగ్యసమస్యలు లేకపోవడంతో డిశ్ఛార్జి చేశారు. వారిలో ఎలాంటి అలర్జీలు లేవు. అయితే, వారి…

నిర్మాతలను ఆదుకుంటున్న ఓటీటీ…తమన్నా చిత్రం విడుదల.. భారీ రేటు!

ఈలాక్ డౌన్ సమయంలో థియేటర్లు మూతబడడంతో కొన్ని చిన్నచిత్రాలను ఓటీటీ ప్లేయర్లు ఎంతగానో ఆదుకుంటున్నాయి. తమచిత్రాలు పూర్తయి, విడుదలకు సిద్ధం అయినసమయంలో లాక్ డౌన్ రావడంతో చిన్నచిత్రాలనిర్మాతలకు ఎటూ పాలుపోని పరిస్థితి ఎదురైంది. ఓపక్కచిత్రనిర్మాణానికి తెచ్చినఅప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడంతో ఓటీటీ వేదికలు వీరిని ఒడ్డునపడేసే నౌకలుగా కనిపిస్తున్నాయి. దీంతో కొందరు నిర్మాతలు తమచిత్రాలను డిజిటల్ గా విడుదలచేస్తున్నారు. ఈక్రమంలో తమన్నా నటించిన ‘దటీజ్ మహాలక్ష్మీ’ కూడా ఓటీటీ ద్వారా విడుదలకు సిద్ధమవుతోంది. హిందీలో కంగనరనౌత్ నటించిన ‘క్వీన్’…

50కి పైగా సమావేశాలు నిర్వహించిన నరేంద్ర మోదీ!

కరోనా కట్టడి నిమిత్తం లాక్ డౌన్ అమలవుతున్నకారణంగా ఇంటికి, కార్యాలయానికి మాత్రమే పరిమితమైనప్రధాని నరేంద్రమోదీ, గడచిననెలరోజులవ్యవధిలో ఆర్థికవ్యవస్థకు ఊతమిచ్చేలా 50కి పైగా సమావేశాలను నిర్వహించారు. ఆర్థికసంస్కరణలఅమలు దిశగానే వీటిల్లో అత్యధికసమావేశాలు జరిగాయి. వివిధసెక్టార్లవారీగా కీలకనిర్ణయాలు తీసుకుని, పలు విభాగాల్లో ఉన్నఅడ్డంకులను తొలగించే దిశగా ప్రధాని సమీక్షలు నిర్వహించారు. సాధారణంగా జరిగే సమావేశాలు, ప్రజా సభలు జరగని నేపథ్యంలో ప్రధాని అత్యధికసమావేశాలు ఆన్ లైన్ మాధ్యమంగానే సాగాయి. ప్రధానితో ఉన్నతాధికారులు దాదాపు 1000పని గంటలపాటు సమావేశమయ్యారు. ఒక్కో సమావేశంలో…

కరోనాపై నిపుణుల సూచనలు…వృద్ధులపైనే అధిక ప్రభావం!

కరోనా వైరస్ వృద్ధులపై అధికంగా ప్రభావం చూపుతున్నవేళ, ఈమహమ్మారి నుంచి పెద్దలను కాపాడుకునేందుకు వైద్యనిపుణులు తాజా సూచనలు చేశారు. మిగతా వారితో పోలిస్తే, 60ఏళ్లు దాటినవృద్ధులతో పాటు షుగర్, గుండె జబ్బులు, హెచ్ఐవీ, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారిపై ఎక్కువప్రభావం కనిపిస్తున్నందునకనీసం మరో నెలరోజులపాటు హై రిస్క్ జోన్ లో ఉన్నవారు ఎవరూ ఇల్లు దాటి బయటకు రావద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇకఏపీలో 60ఏళ్లు దాటినవారు 50లక్షలమంది వరకూ ఉండగా, వీరంతా గడపదాటి బయటకు రావద్దని,…

అలాస్కా భూకంపం పెద్దదే…!

రిక్టర్ స్కేలుపై 7.6తీవ్రతతో అలాస్కా దక్షిణతీరంలో సంభవించినభూకంపం పెను ప్రభావాన్నే చూపించింది. దేశవ్యాప్తంగా ఎన్నో జాతీయరహదారులు, వేలకొద్దీ భవనాలు దెబ్బతిన్నాయి. తీరం నుంచి ఆగ్నేయదిశగా, సముద్రంలో 105కిలోమీటర్లదూరంలో 17మైళ్లలోతునప్రకంపనలు రాగా, సునామీ హెచ్చరికలను సైతం జారీ చేయడం జరిగింది. అయితే, ప్రకంపనలతీవ్రతచాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ, ప్రజలలో చాలామందికి దీని తీవ్రతపెద్దగా తెలియలేదని భూకంపపరిశోధకుడు మైకేల్ వెస్ట్ వెల్లడించారు. అలాస్కాకు 160కిలోమీటర్లపరిధిలో వున్నవారికి ప్రకంపనలు స్పష్టంగా తెలిశాయని, ఆపై 805కిలోమీటర్లవరకూ ఉన్నవారు భూకంపం వచ్చినట్టు గ్రహించారని వెల్లడించారు. అలాస్కా…

బ్యాంక్ ఎంప్లాయిస్ కు బంపరాఫర్! …15 శాతం వరకూ వేతనాల పెంపు

కరోనా, లాక్ డౌన్ కారణంగా ఎన్నో రంగాలు తీవ్రఇబ్బందులు పడుతున్నవేళ, ప్రభుత్వరంగబ్యాంకు ఉద్యోగులకు మాత్రం తీపి కబురు అందింది. దేశవ్యాప్తంగా 9లక్షలమందికి పైగా బ్యాంకు ఉద్యోగులకు శుభవార్తచెబుతూ, 15శాతం జీతాలపెంపుతో పాటు, నాలుగు శాతం పెన్షన్ కంట్రిబ్యూషన్ ను పెంచేందుకు ఐబీఏ (ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్), ఉద్యోగసంఘాలమధ్యజరిగినచర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. ఈపెంపు నవంబర్ 2017నుంచే అమలులోకి రానుంది. దీని ప్రకారం, గతంలో బేసిక్ వేతనంలో 10శాతం పదవీ విరమణప్రయోజనాల్లో కలుస్తుండగా, ఇకపై 14శాతం బేసిక్ వేతనం, డీఏలు…

శ్రావణ మాసం ఎఫెక్ట్…గరిష్ఠ స్థాయికి చేరుకున్న బంగారం ధరలు

శ్రావణమాసం అడుగిడడంతోనే బంగారం ధరలు భగ్గుమన్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఈమాసం నెలవు కావడంతో ధరలు ఊపందుకున్నాయి. పసిడి వైపు చూడడానికే భయపడేలా పరుగులు పెడుతున్నాయి. ఢిల్లీలో నిన్న10గ్రాములకు రూ. 430పెరిగి రూ. 50,920కి చేరుకుంది. అంతర్జాతీయధరలకు అనుగుణంగానే దేశీయంగానూ ధరలు పెరుగుతున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ‌స్ తెలిపింది. ముంబైలో ధర10గ్రాములకు రూ.50,181గా నమోదైంది. ఇక, హైదరాబాద్‌లో 10గ్రాములపసిడి ధరరూ. 51,700కు పెరగ్గా, వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఢిల్లీలో నిన్నకిలోకు ఏకంగా రూ. 2,550పెరిగి రూ. 60,400కి…