50కి పైగా సమావేశాలు నిర్వహించిన నరేంద్ర మోదీ!

కరోనా కట్టడి నిమిత్తం లాక్ డౌన్ అమలవుతున్నకారణంగా ఇంటికి, కార్యాలయానికి మాత్రమే పరిమితమైనప్రధాని నరేంద్రమోదీ, గడచిననెలరోజులవ్యవధిలో ఆర్థికవ్యవస్థకు ఊతమిచ్చేలా 50కి పైగా సమావేశాలను నిర్వహించారు. ఆర్థికసంస్కరణలఅమలు దిశగానే వీటిల్లో అత్యధికసమావేశాలు జరిగాయి. వివిధసెక్టార్లవారీగా కీలకనిర్ణయాలు తీసుకుని, పలు విభాగాల్లో ఉన్నఅడ్డంకులను తొలగించే దిశగా ప్రధాని సమీక్షలు నిర్వహించారు. సాధారణంగా జరిగే సమావేశాలు, ప్రజా సభలు జరగని నేపథ్యంలో ప్రధాని అత్యధికసమావేశాలు ఆన్ లైన్ మాధ్యమంగానే సాగాయి. ప్రధానితో ఉన్నతాధికారులు దాదాపు 1000పని గంటలపాటు సమావేశమయ్యారు. ఒక్కో సమావేశంలో…

కరోనాపై నిపుణుల సూచనలు…వృద్ధులపైనే అధిక ప్రభావం!

కరోనా వైరస్ వృద్ధులపై అధికంగా ప్రభావం చూపుతున్నవేళ, ఈమహమ్మారి నుంచి పెద్దలను కాపాడుకునేందుకు వైద్యనిపుణులు తాజా సూచనలు చేశారు. మిగతా వారితో పోలిస్తే, 60ఏళ్లు దాటినవృద్ధులతో పాటు షుగర్, గుండె జబ్బులు, హెచ్ఐవీ, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారిపై ఎక్కువప్రభావం కనిపిస్తున్నందునకనీసం మరో నెలరోజులపాటు హై రిస్క్ జోన్ లో ఉన్నవారు ఎవరూ ఇల్లు దాటి బయటకు రావద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇకఏపీలో 60ఏళ్లు దాటినవారు 50లక్షలమంది వరకూ ఉండగా, వీరంతా గడపదాటి బయటకు రావద్దని,…

అలాస్కా భూకంపం పెద్దదే…!

రిక్టర్ స్కేలుపై 7.6తీవ్రతతో అలాస్కా దక్షిణతీరంలో సంభవించినభూకంపం పెను ప్రభావాన్నే చూపించింది. దేశవ్యాప్తంగా ఎన్నో జాతీయరహదారులు, వేలకొద్దీ భవనాలు దెబ్బతిన్నాయి. తీరం నుంచి ఆగ్నేయదిశగా, సముద్రంలో 105కిలోమీటర్లదూరంలో 17మైళ్లలోతునప్రకంపనలు రాగా, సునామీ హెచ్చరికలను సైతం జారీ చేయడం జరిగింది. అయితే, ప్రకంపనలతీవ్రతచాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ, ప్రజలలో చాలామందికి దీని తీవ్రతపెద్దగా తెలియలేదని భూకంపపరిశోధకుడు మైకేల్ వెస్ట్ వెల్లడించారు. అలాస్కాకు 160కిలోమీటర్లపరిధిలో వున్నవారికి ప్రకంపనలు స్పష్టంగా తెలిశాయని, ఆపై 805కిలోమీటర్లవరకూ ఉన్నవారు భూకంపం వచ్చినట్టు గ్రహించారని వెల్లడించారు. అలాస్కా…

బ్యాంక్ ఎంప్లాయిస్ కు బంపరాఫర్! …15 శాతం వరకూ వేతనాల పెంపు

కరోనా, లాక్ డౌన్ కారణంగా ఎన్నో రంగాలు తీవ్రఇబ్బందులు పడుతున్నవేళ, ప్రభుత్వరంగబ్యాంకు ఉద్యోగులకు మాత్రం తీపి కబురు అందింది. దేశవ్యాప్తంగా 9లక్షలమందికి పైగా బ్యాంకు ఉద్యోగులకు శుభవార్తచెబుతూ, 15శాతం జీతాలపెంపుతో పాటు, నాలుగు శాతం పెన్షన్ కంట్రిబ్యూషన్ ను పెంచేందుకు ఐబీఏ (ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్), ఉద్యోగసంఘాలమధ్యజరిగినచర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. ఈపెంపు నవంబర్ 2017నుంచే అమలులోకి రానుంది. దీని ప్రకారం, గతంలో బేసిక్ వేతనంలో 10శాతం పదవీ విరమణప్రయోజనాల్లో కలుస్తుండగా, ఇకపై 14శాతం బేసిక్ వేతనం, డీఏలు…

శ్రావణ మాసం ఎఫెక్ట్…గరిష్ఠ స్థాయికి చేరుకున్న బంగారం ధరలు

శ్రావణమాసం అడుగిడడంతోనే బంగారం ధరలు భగ్గుమన్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఈమాసం నెలవు కావడంతో ధరలు ఊపందుకున్నాయి. పసిడి వైపు చూడడానికే భయపడేలా పరుగులు పెడుతున్నాయి. ఢిల్లీలో నిన్న10గ్రాములకు రూ. 430పెరిగి రూ. 50,920కి చేరుకుంది. అంతర్జాతీయధరలకు అనుగుణంగానే దేశీయంగానూ ధరలు పెరుగుతున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ‌స్ తెలిపింది. ముంబైలో ధర10గ్రాములకు రూ.50,181గా నమోదైంది. ఇక, హైదరాబాద్‌లో 10గ్రాములపసిడి ధరరూ. 51,700కు పెరగ్గా, వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఢిల్లీలో నిన్నకిలోకు ఏకంగా రూ. 2,550పెరిగి రూ. 60,400కి…

రెండు దశాబ్దాలుగా అధ్యక్ష పీఠంపై ఉన్న పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆదేశప్రజలు విశేషఅధికారాలు కట్టబెట్టారు. ఇకజీవితాంతం ఆయనే అధ్యక్షపీఠంపై కూర్చోనున్నారు. దేశాధ్యక్షుడి పదవీకాలంపై ఉన్నపరిమితిని ఎత్తివేసేందుకు ఉద్దేశించినరాజ్యాంగసవరణకు అనుకూలంగా 78శాతం రష్యన్లు ఓటేశారు. పుతిన్ ఇప్పటికే రెండు దశాబ్దాలుగా రష్యాను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నారు. 1999లో ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించినపుతిన్ ఆఏడాది చివరినాటికి దేశానికి తాత్కాలికఅధ్యక్షుడయ్యారు. 2000మార్చి ఎన్నికల్లో అధ్యక్షపీఠాన్ని దక్కించుకున్నారు. అధ్యక్షుడు కావడంతోనే వేర్పాటువాదగ్రూపులపై విరుచుకుపడి ప్రజలమన్ననలు అందుకుని తిరుగులేని నాయకుడయ్యారు. దీంతో 2004లో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఏకంగా జీవితాంతం అధ్యక్షపీఠంపై…

తనకు కరోనా సోకిందేమోనన్న భయంతో అన్న ఆత్మహత్య

తమ్ముడికి సోకినకరోనా తనకెక్కడఅంటుకుంటుందోనన్నభయంతో అన్నఆత్మహత్యచేసుకున్నఘటనకర్ణాటకలో జరిగింది. పోలీసులకథనం ప్రకారం.. కోలారులోని గాంధీనగర్ కాలనీకి చెందిననాగరాజ్ (37) తాపీ కార్మికుడు. అతడి తమ్ముడికి కరోనా సోకినట్టు శనివారం నిర్ధారణఅయింది. సమాచారం అందుకున్నవైద్యాధికారులు ఇంటికొచ్చి అతడిని ఆసుపత్రికి తరలించారు. తమ్ముడికి కరోనా సోకిందని తెలిసినప్పటి నుంచి నాగరాజ్‌లో ఆందోళనమొదలైంది. తనకు కూడా వైరస్ సోకి ఉంటుందన్నభయంతో అదే రోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. నిన్నఉదయం ఫ్యాన్‌కు వేలాడుతున్ననాగరాజ్ మృతదేహాన్ని చూసినకుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం…

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం…!

అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం రేపాయి. వాషింగ్టన్ జిల్లా వాయవ్యప్రాంతంలోని 14వవీధి స్ప్రింగ్ రోడ్డు వద్దజరిగినఈఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. నిత్యం రద్దీగా ఉండే ఈరోడ్డుపై నిన్నసాయంత్రం దాదాపు 5గంటలప్రాంతంలో ఈఘటనజరిగింది. కాల్పులు జరిపినముగ్గురు ఆఫ్రో అమెరికన్లని మెట్రోపాలిటన్‌ పోలీసు చీఫ్‌ పీటర్‌ న్యూషామ్‌ తెలిపారు. వీరిలో ఇద్దరు పెద్దతుపాకులతో కాల్పులు జరపగా, మరొకరు పిస్టల్‌తో కాల్చినట్టు వివరించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాలసాయంతో దుండగులకోసం పోలీసులు…

కరోనా నేపథ్యంలో బంతికి ఉమ్ము రాయడంపై నిబంధనలు

కరోనా విజృంభణనేపథ్యంలో అంతర్జాతీయక్రికెట్‌ నిబంధనల్లో పలు మార్పులు చోటు చేసుకున్నవిషయం తెలిసిందే. బంతికి ఉమ్ము రాయ‌కూడ‌ద‌న్ననిబంధ‌నకూడా తీసుకొచ్చారు. అయితే, వెస్టిండీస్‌-ఇంగ్లండ్‌ మధ్యమాంచెస్ట‌ర్‌లో జ‌రుగుతున్నరెండ‌వటెస్టులో ఇంగ్లండ్ క్రికెట‌ర్ డామ్ సిబ్లే బంతికి ఉమ్ము రాయడంతో ఆబంతిని అంపైర్లు శానిటైజ్ చేయాల్సి వచ్చింది. ఆట4‌వరోజునఫీల్డింగ్ చేస్తున్నస‌మ‌యంలో ఇంగ్లండ్‌ ఆటగాడు సిబ్లే పొరపాటునబంతికి ఉమ్ము రాయడంతో, ఈవిషయం ఇంగ్లండ్ టీమ్‌ అంపైర్ల‌కు చెప్ప‌డంతో వారు ఈజాగ్రత్తలు తీసుకున్నారు. పొరపాటునఉమ్ము రాసినట్లు సిబ్లే ఒప్పుకున్నాడు. కాగా, బంతికి ఉమ్ము రాయడం క్రికెటర్లకు అలవాటే.…

ఈ రోజు విజయవంతంగా ‘హోప్’ మిషన్ ప్రయోగం!

అంగారకగ్రహయాత్రదిశగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేసినతొలి అడుగు ఈరోజు విజయవంతంగా ముందుకు పడింది. ఎమిరేట్స్ మార్స్ మిషన్‌కు చెందినహోప్ అంతరిక్షనౌకను హెచ్-11ఏవాహకనౌకనింగిలోకి మోసుకెళ్లింది. జపాన్‌లోని తనెగాషిమా అంతరిక్షకేంద్రం నుంచి దీనిని ప్రయోగించారు. నిజానికి ప్రయోగం గతబుధవారమే జరగాల్సి ఉండగా, ప్రతికూలవాతావరణపరిస్థితులకారణంగా వాయిదా పడింది. అంగారకగ్రహం మీదవాతావరణపరిస్థితులఅధ్యయనమే లక్ష్యంగా చేపట్టినఈమిషన్‌లో 200రోజుల (దాదాపు ఏడు నెలలు) పాటు యాత్రసాగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అంగారకకక్ష్యలోకి చేరు కోనుంది. ఆతర్వాత687రోజులపాటు అధ్యయనం కొనసాగుతుందని యూఏఈస్పేస్ సెంటర్ తెలిపింది.…