దేశంలో 11 లక్షలు దాటిన కరోనా కేసులు…

దేశంలో కొవిడ్‌-19కేసులఉద్ధృతి కొనసాగుతోంది. గత24గంటల్లో భారత్‌లో 40,425మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్రవైద్య, ఆరోగ్యమంత్రిత్వశాఖతెలిపింది. దేశంలో ఒక్కరోజులో నమోదైనఅత్యధికకేసులు ఇవే. అదే సమయంలో 681మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కరోనా కేసులసంఖ్యఇప్పటివరకు మొత్తం 11,18,043కి చేరగా, మృతులసంఖ్యమొత్తం 27,497కి పెరిగింది. 3,90,459మందికి ఆసుపత్రుల్లో చికిత్సఅందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 7,00,087మంది కోలుకున్నారు.

కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,40,47,908శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయవైద్యపరిశోధనమండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్నఒక్కరోజులో 2,56,039శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనాతో కన్నుమూత

గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నతిరుమలశ్రీవారి ఆలయమాజీ ప్రధానఅర్చకుడు శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనాతో కన్నుమూశారు. శ్రీవారి సేవలో రెండు దశాబ్దాలకు పైగా కొనసాగినదీక్షితులు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాసవిడిచారు.

దీక్షితులకు ఆలయం తరపునసంప్రదాయపద్ధతిలో అంతిమవీడ్కోలు నిర్వహించాల్సి ఉంది. అయితే, ఆయనకరోనాతో మృతి చెందడంతో ఇది సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది. అంతేకాదు, ఆయనభౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు కానీ, మరొకరికి కానీ అప్పగించే అవకాశం కూడా లేదని సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు…నేడు తేలిపోనున్న టీ20 ప్రపంచకప్ భవితవ్యం.

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నటీ20ప్రపంచకప్ భవితవ్యం నేడు తేలిపోనుంది. నేడు జరగనున్నవర్చువల్ సమావేశంలో ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ అటో ఇటో తేల్చేయనుంది. కరోనా నేపథ్యంలో ప్రపంచకప్ నిర్వహణసాధ్యం కాదని ఆతిథ్యదేశం ఆస్ట్రేలియా ఇప్పటికే తనవైఖరిని స్పష్టం చేసిననేపథ్యంలో ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఐసీసీ నిర్ణయంపైనే ఐపీఎల్ భవితవ్యం కూడా ఆధారపడి ఉంది. టీ20ప్రపంచకప్ సాధ్యం కాదన్నవిషయాన్ని కనుకఐసీసీ తేల్చేస్తే అదే సమయంలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐయోచిస్తోంది. ఐసీసీ చైర్మన్‌గా శశాంక్ మనోహర్…

ఈ నెలలో మరింతగా చెలరేగుతున్న కరోనా వైరస్…!

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా తనవిజృంభణను కొనసాగిస్తోంది. ఈనెలలో రోజుకు సగటున2లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్నటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1.45కోట్లకేసులు నమోదు కాగా, 6లక్షలమందికిపైగా కరోనా కాటుకు బలయ్యారు. రికార్డు స్థాయిలో నిన్నఒక్కరోజే 2,54,381కేసులు నమోదైనట్టు ప్రపంచఆరోగ్యసంస్థపేర్కొంది. ఇక, అత్యధికకేసులజాబితాలో ప్రపంచంలోనే తొలి నాలుగు స్థానాల్లో ఉన్నఅమెరికా, బ్రెజిల్, ఇండియా, రష్యాలలో వైరస్ మరింతగా చెలరేగిపోతోంది. పెరూ, చిలీ వంటి చిన్నదేశాల్లోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక, అత్యధికమరణాలు సంభవిస్తున్నతొలి ఐదు దేశాల్లో అమెరికా, బ్రెజిల్, బ్రిటన్,…

వచ్చే ఏడాది మధ్య వరకు, ఆ తర్వాత కూడా వైరస్ విజృంభించే అవకాశం

ఈఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ కనుకరాకపోతే పరిస్థితులు మరింతదారుణంగా తయారవుతాయని గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ లీడర్స్‌ స్టడీ ఆందోళనవ్యక్తం చేసింది. టీకా కనుకఅందుబాటులోకి రాకుంటే వచ్చే ఏడాది మధ్యవరకు, ఆతర్వాతకూడా కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే ఏడాది జులై కంటే ముందుగా వ్యాక్సిన్ విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలులేవని సర్వేలో పాల్గొన్నఆరోగ్యపరిరక్షణరంగనిపుణుల్లో నాలుగింటమూడొంతులమంది అభిప్రాయపడ్డారు. గ్లోబల్ హెల్త్ కేర్ స్టడీ-2020పేరిటలజార్డ్స్ హెల్త్ కేర్ గ్రూప్ నిర్వహించినఈసర్వేలో ‘హెల్త్ కేర్ పరిశ్రమలు: కోవిడ్ మహమ్మారికి…

దేవినేని సీతారామయ్య హెరిటేజ్ ఫుడ్స్ మాజీ చైర్మన్ కన్నుమూత

ప్రముఖఆడిటింగ్ సంస్థబ్రహ్మయ్యఅండ్ కంపెనీలో సీనియర్ పార్ట్ నర్, హెరిటేజ్ ఫుడ్స్ మాజీ చైర్మన్ దేవినేని సీతారామయ్య (96) అనారోగ్యంతో కన్నుమూశారు. సీతారామయ్యకొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించినవ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాసవిడిచారు. రేపు ఉదయం ఆయనభౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ నివాసానికి తీసుకెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయనకు ఓకుమార్తె, కుమారుడు ఉన్నారు. సీతారామయ్యతెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. గతంలో ఆయనటీటీడీ బోర్డు చైర్మన్ గానూ, ఆర్ బీఐప్రాంతీయడైరెక్టర్…

చిలుకూరు బాలాజీ ఆలయంలో తాబేలు…

హైదరాబాద్ శివారు ప్రాంతం చిలుకూరులో ఉన్నబాలాజీ ఆలయం ఎంతప్రసిద్ధికెక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఈఆలయంలో ఓతాబేలు దర్శనమివ్వడం అర్చకులను విస్మయానికి గురిచేసింది. ఆలయం అన్ని తలుపులు మూసివేసినా సరే తాబేలు ఎలా ప్రవేశించిందన్నది ఓమిస్టరీగా మారింది. దీనిపై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధానపూజారి రంగరాజన్ స్పందించారు. ఆలయంలో తాబేలు ప్రవేశించడాన్ని శుభసంకేతంగా భావిస్తున్నామని, కరోనా అంశంలో ప్రజలు త్వరలోనే మంచి వార్తవింటారన్నదానికి ఇది సూచికఅని తెలిపారు. ఈతాబేలును తొలుతస్థానికశివాలయం పూజారి సురేశ్ ఆత్మారాం చూశారు. ఈతాబేలు ఎంతో…

తిరుపతి ఎయిర్ పోర్టులో తృటిలో ప్రమాదం

తిరుపతి రేణిగుంటవిమానాశ్రయంలో ఇండిగో విమానానికి ముప్పు తప్పింది. బెంగళూరు నుంచి 71మంది ప్రయాణికులతో వచ్చినఈవిమానం ల్యాండింగ్ కు సన్నద్ధమవుతున్నతరుణంలో రన్ వేపై ఓఫైరింజన్ బోల్తాపడింది. చివరి నిమిషంలో ఈవిషయం గుర్తించినఅధికారులు వెంటనే ఇండిగో విమానపైలెట్ ను అప్రమత్తం చేశారు.

 

ఆవిమానం మళ్లీ గాల్లోకి లేచింది. దాంతో పెద్దప్రమాదం తప్పిపోయింది. ఫైరింజన్ ను తొలగించేందుకు సమయం పడుతుందన్ననేపథ్యంలో ఆవిమానాన్ని తిరిగి బెంగళూరుకు మళ్లించారు.

తక్కువ ఉష్ణోగ్రతల్లో వైరస్ విజృంభిస్తుందంటున్న పరిశోధకులు

ప్రస్తుతం భారత్ లో వేసవి కాలం ముగిసి వర్షాకాలం ఆరంభమైంది. ఉత్తరాది రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. వర్షాకాలం ముగిసినవెంటనే శీతాకాలం రానుండడంతో కరోనా వ్యాప్తిపై తీవ్రభయాందోళనలు నెలకొన్నాయి. చల్లని వాతావరణంలో వైరస్ మరింతతీవ్రంగా విజృంభిస్తుందన్నప్రచారమే అందుకు కారణం. ఈనేపథ్యంలో భువనేశ్వర్ ఐఐటీ, ఎయిమ్స్ సంయుక్తంగా నిర్వహించినఓఅధ్యయనంలో ఆసక్తికరఅంశాలు వెల్లడయ్యాయి. రుతుపవనాలసీజన్ పతాకస్థాయికి చేరినప్పుడు, చలికాలంలో కరోనా వ్యాప్తి భారత్ లో అత్యంతభీకరస్థాయికి చేరుతుందని పరిశోధకులు వెల్లడించారు. వర్షాలకారణంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయని, ఆతర్వాతవచ్చే చలికాలం వాతావరణపరంగా…

ఏపీలో కరోనాతో 56 మంది మృతి…

కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. అటు మరణాలు, ఇటు కొత్తకేసులు అడ్డు, అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 56మంది మృత్యువాతపడగా, గడచిన24గంటల్లో 5,041మందికి పాజిటివ్ అని తేలింది. దాదాపు అన్ని జిల్లాల్లో భారీగా కొత్తకేసులు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైనపాజిటివ్ కేసులసంఖ్య49,650కి చేరింది. మరణాలసంఖ్యకూడా అంతకంతకు పెరుగుతుండడం ప్రభుత్వయంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో 10మంది, శ్రీకాకుళం జిల్లాలో 8మంది, కర్నూలు జిల్లాలో ఏడుగురు, విశాఖజిల్లాలో ఏడుగురు, కృష్ణా జిల్లాలో ఏడుగురు, ప్రకాశం జిల్లాలో…