జూలై 24 నాటికి భూమికి సమీపంగా గ్రహశకలం

గ్రహశకలాలప్రమాదం భూమికి ఈనాటిది కాదు. ఇటీవలకాలంలో అనేకసార్లు గ్రహశకలాలు భయపెట్టినా, భూమండలానికి పెద్దగా ప్రమాదం జరగలేదు. అయితే, ఇప్పుడు ‘ఆస్టరాయిడ్ 2020ఎన్డీ’ అనే గ్రహశకలం భూమి దిశగా అమితవేగంతో దూసుకువస్తోందని, ఇతరగ్రహశకలాల్లా దీన్ని తేలిగ్గా తీసుకోలేమని అమెరికా అంతరిక్షపరిశోధనసంస్థ ‘నాసా’ హెచ్చరించింది. ఇది సైజు పరంగానే కాకుండా, వేగం రీత్యా కూడా ప్రమాదకరం అని పేర్కొంది. ఇది భూమి దిశగా కదులుతున్నతీరు ఆందోళనకలిగిస్తోందని ‘నాసా’ తెలిపింది. ఇది జూలై 24నాటికి భూమికి సమీపంగా వస్తుందని వెల్లడించింది. ఇదే…